11, ఏప్రిల్ 2011, సోమవారం

అన్యాయం

మార్చ్ 27, 2011

ఈరోజు నేను పాలెం( పాలమూరు) Oriantal కాలేజీ డేకి స్పీకర్ గా వెళ్ళాను. ఎంత అన్యాయం ,తెలంగాణాలో ఇది మొదటి కాలేజీ. 1964 లో ఏర్పడింది. స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. రెగ్యులర్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు. ఇదే జిల్లాలో కొడంగల్ కాలేజీని మూసివేసారు. ఆంద్ర పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయం ఇది. ఈ కాలేజీ ఎంతో మంది మేధావులను అందించింది. ఇవ్వాల మోడుపోఇన చెట్టు లా ఉన్నది. ఇది ఈ నేల దుస్తితి. తెలుగు భాష పేరుతో తెలంగాణకు చేస్తున్న అన్యాయం .

ఇదే జిల్లాలో నాగర్ కర్నూల్ మండలం లోని ఒక అద్బుతమైన గ్రామాన్ని పరిచయం చేస్తున్నాను. మీ స్మృతి శకలాలలో తడి వుంటే యాడాది కిందట ప్రమాదంలో మరణించిన కృష్ణ వర్మ అనే కళాకారుడు గొంతు వినిపిస్తూ వుండాలి. ఆయన పుట్టిన గ్రామమే ఇది. ఈ మట్టిలో నడయాడిన అతని పాదాలు దేశాన్నంతా తిరిగొచ్చాయి. ఆ వూరి ప్రజలు మట్టి తట్టను నెత్తిన పెట్టుకొని బతకడానికి వలస పోయారు. కాని కృష్ణ వర్మ గోసి గొంగడితో పాటను మోసుకొని తిరిగాడు. అది లఖ్నోఅయితే నీలి జెండాను ఆకాశం అంత ఎత్తుకు ఎగిరేసాడు, అది నాగపూర్ అయితే తథాగతుడు జీవిత సారాన్ని గానం చేసాడు, ఇక తెలంగాణా లో నైతే గోరేట వెంకన్న మస్తిష్కం నుంచి జాలు వారిన ప్రతి పాటను పాడాడు. రేలా ధూళ అంటూ తెలంగాణాను చిందు వేయించాడు. పాలమూరులో పారిన కన్నీటి అలల ఫై దుక్క గీతాన్ని ఆలాపించాడు. పాట కోసం అతను బతికాడు, పైసా కోసం అతని భార్య ఆలోచించింది. సంధి కుదరలేదు. భార్య వదిలేసింది. ఇప్పుడు, కూలి పోఇన పాత గోడల సాక్షిగా వాళ్ళిద్దరికీ పుట్టిన ఏడేండ్ల పాప వుంది. ఇది ఒక కృష్ణ వర్మ జీవితమే కాదు, తెలంగాణా లో చదువు లేక, కొలువు లేక వున్నా నీళ్ళు దక్కక చాలా జీవితాలు ఇలా చిద్రమయ్యాయి అతడి సంస్మరణ సభలో పాల్గొని బరువెక్కి న నా గుండె బాధను కొంతైనా దింపుకుందామని మీతో పంచుకుంటున్నాను.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అనవసరంగా ప్రాంతాల పేరెత్తి ద్వేషం కక్కకండి. ఆంధ్ర ఏరియాలో కూడా అనేక ఓరియంటల్ కాలేజీల్ని ఎన్టీయార్ హయాములో మూసేశారు. ప్రస్తుతం అక్కడ కూడా జిల్లాకొక్క ఓరియంటల్ కాలేజీయే ఉంది.

Unknown చెప్పారు...

అన్నా... ..!
రాజకీయ లబ్దికోసం K .C.R నోటి ని నాటు గ ఘాటుగా వాడుతుంటే ,
చదువుకున్న మీ లాంటి మెధావులుకుడా, మా జీవితాల్లో వెలుగుని ఆంధ్ర పాలకులు - సూర్యునికి మీఘాలను అడ్డం పెట్టి తీసుకేల్లిపొయ్యారు అన్నట్టు మాటాదతారెందుకు?
కుల ,మత ,జాతి, ప్రాంత అభిమానాలను రెచ్చగొట్టడం చాలా EASY .సులువైన మార్గం లో లబ్ది పొందాలనుకునే రాజకీయ
మేత-ఆవుల TRICS లకు మీలాంటి మేధావులు కూడా సామాన్యులు లాగా పడిపోతే ఎలా !?